‘ఉద్యమస్ఫూర్తికి తెలుగువారు గర్విస్తున్నారు’
close
Updated : 05/02/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఉద్యమస్ఫూర్తికి తెలుగువారు గర్విస్తున్నారు’

ఈనెల 10 తర్వాత రాజధానిలో పర్యటిస్తా

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

అమరావతి: రాజధాని రైతుల వాణి దేశం నలుమూలలా వ్యాపించేలా నినదిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రైతులు, ఆడపడుచులు చేపట్టిన నిరాహార దీక్షలు, ఆందోళనలు 50 రోజులకు చేరుకున్నా వారిలో ఏమాత్రం సడలని ఉద్యమస్ఫూర్తి, శాంతియుత పంథా చూసి తెలుగువారంతా గర్విస్తున్నారని చెప్పారు. ఈ మేరకు పవన్‌ పేరుతో జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజధాని నిర్మాణానికి నిస్వార్థంగా 33వేల ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వానికి సమర్పించి ఇప్పుడు రోడ్డున పడిన రైతన్నకు సర్వదా అండగా ఉంటానని గతంలో మాటిచ్చానని పవన్‌ గుర్తుచేసుకున్నారు. ఈనెల 10వ తేదీ తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు తెలిపారు. రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న పవన్‌ పునరుద్ఘాటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని