యూపీ సీఎంకు ఈసీ షోకాజ్‌ నోటీసు
close
Published : 07/02/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీ సీఎంకు ఈసీ షోకాజ్‌ నోటీసు

దిల్లీ: యూపీ ముఖ్యమంత్రి, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులిచ్చింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది. 

ఫిబ్రవరి 1న జరిగిన ప్రచార సభలో యోగి మాట్లాడుతూ.. షాహిన్‌బాగ్‌ ఆందోళనలకు ఆప్‌ సహకరిస్తోందన్నారు. ఉగ్రవాదులకు బిర్యానీలు అందజేస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. 70 స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు పోలింగ్‌ జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని