సీఏఏకి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం
close
Published : 09/02/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఏఏకి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ తీర్మానం

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఈ నిర్ణయానికి సహకరించిన సభ్యులకు బొంతు రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి మినీ ఇండియాను తలపిస్తోందని రామ్మోహన్ అన్నారు. అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నగరంలోని పార్కుల్లో శౌచాలయాలు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వీటి కోసం రూ.50 కోట్ల వరకు నిధులను కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రెండు పడక గదుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 1,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుతం రెండు పడక గదుల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని మేయర్ స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని