ఐదు రెట్లు పెరిగిన భాజపా
close
Published : 11/02/2020 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు రెట్లు పెరిగిన భాజపా

దిల్లీ: దేశ రాజధానిలో మరోసారి సామాన్యుడి ప్రభుత్వం కొలువుదీరనుంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఉదయం 10.05 సమయంలో ఆప్‌ 54 చోట్ల ముందంజలో ఉండగా.. భాజపా 15, ఇతరుల ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో ఉన్నప్పటికీ గతంలో కంటే చాలా మెరుగైంది. అప్పటికంటే ఐదింతలు ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా.. తాజా ఫలితాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అంటే గతంలో కంటే భాజపా బలం ఇప్పుడు దాదాపు ఐదింతలు పెరిగినట్లే. ముఖ్యంగా ఓఖ్లా వంటి నియోజకవర్గంలో భాజపా ఆధిక్యం కనబర్చడం విశేషం. 

ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ధర్నా జరుగుతూ వార్తల్లో నిలిచిన షాహీన్‌ బాగ్‌ ఓఖ్లా నియోజకవర్గంలోనే ఉంది. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో భాజపా ఆధిక్యంలో ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని