రాజకీయాలు నాకు రిటైర్మెంట్‌ ప్లాన్‌ కాదు:పవన్‌
close
Published : 17/02/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజకీయాలు నాకు రిటైర్మెంట్‌ ప్లాన్‌ కాదు:పవన్‌

విలీనం ప్రసక్తే లేదన్న జనసేనాని 

అమరావతి: భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తమ పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయేది కాదని.. ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకునేదని చెప్పారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో రేపల్లె శాసనసభ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కార్యకర్తలు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. ప్రజల మనసులు గెలుచుకోగలిగామని చెప్పారు. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయాయని.. దానిని మనమే శుభ్రం చేయాలన్నారు.

ఏపీలో రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణలా తయారయ్యాయని.. ఇలాంటి సంస్కృతి మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పవన్‌ పిలుపునిచ్చారు. కుల రాజకీయాలు మారాలంటే సరికొత్త రాజకీయ వ్యవస్థ నెలకొల్పాలని, అది జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజధాని కోసం 33వేల ఎకరాలు అవసరమా? అని నాడు ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. కక్ష సాధింపు రాజకీయాల వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని చెప్పారు. అనంతరం పార్టీ న్యాయ విభాగం సమావేశంలోనూ పవన్‌ మాట్లాడారు. జనసేనను బతికించింది సామాన్యుడేనని.. అలాంటి సామాన్యుడికి కవచంలా న్యాయవిభాగం పనిచేయాలని సూచించారు. న్యాయవాదుల నుంచి బలమైన నేతలు రావాలని పిలుపునిచ్చారు. పార్టీకి అండగా ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని పవన్‌ ఆరోపించారు. రాజకీయాలు తనకు రిటైర్మెంట్‌ ప్లాన్‌ కాదని.. ప్రజలకు సేవచేయాలని నిర్ణయించుకునే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్‌ తేల్చి చెప్పారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని