జగన్‌ నిర్ణయం..ఆ కుటుంబానికి ఊరట:పవన్‌
close
Published : 19/02/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ నిర్ణయం..ఆ కుటుంబానికి ఊరట:పవన్‌

అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబానికి ఊరట కలిగిస్తుందని ఓ ప్రకటనలో పవన్‌ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగటంలో ఆలస్యమైందన్నారు. సీబీఐ విచారణ ద్వారా త్వరగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పాఠశాలకు వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో తాను ర్యాలీ నిర్వహిస్తే లక్ష మంది ప్రజలు వచ్చి మద్దతు పలికారని పవన్‌ గుర్తు చేశారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా చేసి.. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచిన జన సైనికులకు, ప్రజా సంఘాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సైనిక సంక్షేమ నిధికి విరాళం అందజేయనున్న పవన్‌

పవన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి గతంలో ప్రకటించిన రూ.కోటి విరాళాన్ని కేంద్రీయ సైనిక్‌ బోర్డు ఉన్నతాధికారులకు ఆయన రేపు అందజేయనున్నారు. విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ‘ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌’ సదస్సులోనూ పవన్‌ పాల్గొననున్నారు. దేశానికి స్వచ్ఛమైన యువ నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో నిర్వహించనున్న ఈ సదస్సులో పవన్‌ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతోపాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని