అమిత్‌ షాతో కేజ్రీవాల్‌ భేటీ
close
Updated : 19/02/2020 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమిత్‌ షాతో కేజ్రీవాల్‌ భేటీ

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి షా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్‌ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేజ్రీవాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ‘హోంమంత్రి అమిత్‌షాను కలిశాను. ఈ సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. దిల్లీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాం. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాం ’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఆప్‌ హోరా హోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ 62 స్థానాల్లో విజయఢంకా మోగించింది. భాజపా ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నెల 16న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌.. దిల్లీ అభివృద్ధి కోసం, పాలన సజావుగా సాగడం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామనీ.. తమకు నరేంద్ర మోదీ ఆశీస్సులు కావాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని