కుటిల రాజకీయాల వల్లే నా సోదరుడు ఆత్మహత్య!
close
Published : 20/02/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటిల రాజకీయాల వల్లే నా సోదరుడు ఆత్మహత్య!

డిప్యూటీ సీఎం ఎదుట ఓ వైకాపా కార్యకర్త ఆవేదన

చిత్తూరు: పార్టీలో కుటిల రాజకీయాల కారణంగానే వైకాపాకు నమ్మిన బంటులా ఉన్న తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఓ అన్న సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎదుట తన గోడు వెల్లబోసుకున్నాడు. పార్టీలో అంతర్గత కలహాలతో మనస్తాపానికి గురై చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం టీకేఎంపేటలో వైకాపా కార్యకర్త భూపాల్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ రెడ్డెప్ప హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న భూపాల్‌ సోదరుడు గుర్రప్ప అక్కడికి వెళ్లి మంత్రి ముందు తన ఆవేదన వ్యక్తంచేశాడు. మండలంలో కొందరు వైకాపా నాయకులు మిగిలిన కార్యకర్తల కష్టాన్ని బయటకు రానీయకుండా అణగదొక్కుతున్నారని ఆరోపించాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని