ఆ కేసులు తక్షణమే ఉపసంహరించాలి:పవన్‌
close
Published : 21/02/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ కేసులు తక్షణమే ఉపసంహరించాలి:పవన్‌

అమరావతి: రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ఎదుట నిరసన తెలిపిన రైతులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు.

రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకే ఆ రైతుల నిరసన తెలిపారన్నారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని..ఇలాంటి తరుణంలో కేసులుపెట్టడం లాంటి చర్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతుందన్నారు. తొలిరోజు నుంచీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతాంగంతో చర్చించకుండా కేసులు పెట్టడంలాంటి చర్యలకు దిగడం అప్రజాస్వామికమని పవన్‌ ఆక్షేపించారు. అమరావతికి మద్దతుగా పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని