ప్రతిపక్షాలు అల్లర్లు ప్రేరేపిస్తున్నాయి: అమిత్‌ షా
close
Updated : 29/02/2020 16:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతిపక్షాలు అల్లర్లు ప్రేరేపిస్తున్నాయి: అమిత్‌ షా

భువనేశ్వర్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సీఏఏ అవగాహన సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

‘‘సీఏఏ వల్ల ముస్లింలు పౌరసత్వం కోల్పోతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. పైగా ప్రజలను రెచ్చగొడుతున్నాయి. సీఏఏ ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని హరించదు’’ అని అమిత్‌ షా అన్నారు. సీఏఏలో ఏ క్లాజ్‌ పౌరసత్వాన్ని హరించేలా ఉందో ప్రజలు నిలదీయాలన్నారు. గత 70 ఏళ్లలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని అమిత్‌ షా అన్నారు.


ఉప్పూ నిప్పూ ఎదురెదురుగా

కేంద్ర ప్రభుత్వం పట్ల నిత్యం ఘర్షణాత్మకంగా వ్యవహరించే మమతా బెనర్జీ.. తృణమూల్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అమిత్‌షా ఎదురుపడ్డారు. ఇందుకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నివాసం వేదికైంది. తూర్పు రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశంలో భాగంగా వీరు ఒడిశా విచ్చేశారు. వారికి నవీన్‌ పట్నాయక్‌ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షా, మమత ఎదురెదురుగా కూర్చుని విందు ఆరగించారు. ఈ విందులో నితీశ్‌ కూడా పాల్గొన్నారు. వీరంతా కలిసి భోజనం చేస్తున్న చిత్రాన్ని నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు. వామపక్ష తీవ్రవాదం, రైల్‌ లింక్‌ ప్రాజెక్టులు తదితర అంశాలపై తూర్పు రాష్ట్రాల కౌన్సిల్‌ సమావేశంలో చర్చించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని