శరణార్థులందరికీ పౌరసత్వం: అమిత్‌ షా
close
Published : 02/03/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శరణార్థులందరికీ పౌరసత్వం: అమిత్‌ షా

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందిరికీ పౌరసత్వం కల్పిస్తామని, అంత వరకు మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన సీఏఏ అనుకూల బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2021లో జరిగే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేదరికాన్ని పారదోలుతామన్నారు.

సీఏఏ విషయంలో తృణమూల్‌ సహా ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్‌షా ఆరోపించారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదని హామీ ఇచ్చారు. పౌరసత్వం ఇచ్చేదే తప్ప హరించే చట్టం కాదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఆర్‌ నోయ్‌ అన్యాయ్‌’ (ఈ అన్యాయాన్ని సహించం) ప్రచారాన్ని షా ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మమత బెనర్జీ ప్రారంభించిన ‘దీదీ కే బోల్‌’ ప్రచారానికి పోటీగా ఈ ప్రచారం చేపట్టారు. ‘దీదీకే బోల్‌’ అని మమత అన్నప్పుడు ‘ఈ అన్యాయాన్ని మేం సహించబోం’ అనే నినాదాన్ని గట్టిగా వినిపించాలని ప్రజలకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.

‘గోలీ మారో..’ నినాదాలు
కోల్‌కతాలో సైతం ‘గోలీ మారో..‌’ నినాదాలు వినిపించాయి. హోంమంత్రి అమిత్‌షా సభ నిర్వహించిన మినార్‌ గ్రౌండ్‌కు వెళుతూ కొందరు భాజపా కార్యకర్తలు ఈ నినాదాలు చేస్తూ కనిపించారు. పార్టీ జెండాలు చేతబూని సభకు వెళుతున్న మార్గంలో ఈ నినాదాలు చేశారు. దీనిపై కోల్‌కతాకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారిని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన భాజపా సభల్లో పలువురు ‘గోలీమారో..’ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని