ఏపీలో ‘పుర’ నోటిఫికేషన్‌ విడుదల
close
Updated : 09/03/2020 17:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో ‘పుర’ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఏపీలో పుర, నగర పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ, 23న పోలింగ్‌, 27న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. 

రాష్ట్రంలోని ప్రస్తుతం 75 పురపాలక, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రమేశ్‌కుమార్‌ చెప్పారు. కొన్ని వివాదాల కారణంగా 3 కార్పొరేషన్లు, 16 పుర, నగర పంచాయతీల్లో ఎన్నికలను వాయిదా వేశామన్నారు. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నందున తర్వాత ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లను వినియోగించడం లేదని రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఎన్నికలు జరగని కార్పొరేషన్లు

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు

ఎన్నికలు జరగని పుర, నగర పంచాయతీలు

రాజాం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేటమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని