షా, రాజ్‌నాథ్‌లను కలిసిన సింధియా
close
Published : 12/03/2020 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షా, రాజ్‌నాథ్‌లను కలిసిన సింధియా

దిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా నేడు ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు.. అమిత్ షా, రాజ్‌నాథ్‌లను కలిశారు. ఈ ఉదయం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నివాసానికి వెళ్లిన సింధియా ఆయనతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. 

సింధియాను కలిసిన ఫొటోను అమిత్ షా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘సింధియా రాక.. మధ్యప్రదేశ్‌లో ప్రజలకు సేవ చేయాలన్న భాజపా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని షా విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు రాజ్‌నాథ్ కూడా సింధియాను సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. ‘సింధియా భాజపాలోకి రావడంతో మా పార్టీ మరింత బలోపేతమైంది. ఆయన తన లక్ష్యాలు, ఆశయాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని రాజ్‌నాథ్‌ ట్వీట్ చేశారు.

అనేక ఉత్కంఠ పరిణామాల అనంతరం సింధియా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే భాజపా కండువా కప్పుకున్నారు. కమలదళంలో చేరిన కొద్ది గంటల్లోనే సింధియాకు మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ టికెట్‌ ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని