మధ్యప్రదేశ్‌ విచారణ రేపటికి వాయిదా
close
Published : 17/03/2020 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యప్రదేశ్‌ విచారణ రేపటికి వాయిదా

దిల్లీ: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బలపరీక్ష నిర్వహణపై భాజపా వేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం భాజపా నేతల పిటిషన్‌పై విచారణ నిర్వహించింది. కాంగ్రెస్‌ తరఫు నుంచి ఎవరూ విచారణకు హాజరుకాకపోవడాన్ని.. భాజపా తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తప్పుబట్టారు. దీంతో విచారణకు హాజరుకాకపోవడంపై స్పందన తెలియజేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను రేపు ఉదయం 10.30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ శాసనసభలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ భాజపా నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఎమ్మెల్యేలు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆయనకు విధేయులైన మరో 22 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో మంత్రులుగా ఉన్న ఆరుగురు రాజీనామాల్ని స్పీకర్‌ సైతం ఆమోదించారు. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ లాల్జీ టాండన్‌ స్పీకర్‌ ప్రజాపతికి సూచించారు. కానీ కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా అసెంబ్లీ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. దీంతో బల పరీక్ష వెంటనే నిర్వహించాలంటూ భాజపా నాయకులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు గవర్నర్‌ మళ్లీ స్పందిస్తూ.. మంగళవారంలోపు బలపరీక్ష పూర్తి చేయాలని స్పీకర్‌కు లేఖ రాశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని