భాజపాలో చేరనున్న 22మంది ఎమ్మెల్యేలు
close
Published : 22/03/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాలో చేరనున్న 22మంది ఎమ్మెల్యేలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు భాజపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను శనివారం కలిశారు. దీంతో త్వరలోనే వీళ్లు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నట్లు తెలిసింది.

ఈ కార్యక్రమంలో సింధియాతో పాటు మరో ఇద్దరు భాజపా ముఖ్య నేతలు నరేంద్రసింగ్‌తోమర్‌, కైలాశ్‌వర్గియ కూడా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కాగా.. మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ నుంచి పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయింది. సింధియా ఇప్పటికే భాజపా సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని