సర్‌ ఎందుకు అన్నా.. తమ్ముడూ అను చాలు!
close
Published : 27/03/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్‌ ఎందుకు అన్నా.. తమ్ముడూ అను చాలు!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ నడిచింది. కొవిడ్‌-19పై పోరులో భాగంగా పవన్‌ కల్యాణ్‌ విరాళం ప్రకటించడంతో మొదలైందీ సంభాషణ. ‘సర్‌ ఎందుకు... తమ్ముడూ అంటే సరిపోతుంద’ని కేటీఆర్‌ అనడంతో.. ‘అలాగే’ అంటూ పవన్‌ సమాధానం ఇవ్వడం వరకు సాగింది. ఇంతకీ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణేంటో చూడాలంటే కాస్త స్క్రోల్‌ చేయాల్సిందే...

కరోనా (కొవిడ్‌ -19) విలయతాండవంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ సమయంలో సహాయార్ధం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెరో ₹50 లక్షలు ఇచ్చారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తే... తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు పవన్‌. అందులో కేటీఆర్‌ను సర్‌ అని పవన్‌ సంబోధించారు. 

ఆ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ‘‘ధన్యవాదాలు అన్నా..  అయినా మీరు నన్ను సర్‌ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి’’ అని కోరారు.

దానికి పవన్‌ ‘సరే తమ్ముడూ’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ట్విటర్‌లో ఈ సంభాషణ హైలైట్‌గా నిలుస్తోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని