సమస్యలపై దృష్టి పెట్టండి: పవన్‌
close
Published : 29/03/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమస్యలపై దృష్టి పెట్టండి: పవన్‌

పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ఆందోళనలో ఉన్న ప్రజానీకానికి అండగా నిలవడమే మన ధర్మం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు.
‘‘ఇది రాష్ట్రానికే కాదు.. ప్రపంచమంతటికీ విపత్కర సమయం. మన దగ్గర లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించండి. రైతులు, కార్మికులు, పేదలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోండి. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. స్థానికంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేపడుతున్న పనులను పరిశీలించండి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏ విధంగా వ్యయం అవుతున్నాయో దృష్టి పెట్టండి. మామిడి రైతుల సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ రైతుల్లో నెలకొన్న ఆందోళనపై సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశా. మీ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పార్టీ కార్యాలయానికి నివేదిక ఇవ్వండి. కరోనా నేపథ్యంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, జనసైనికులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని పార్టీ నేతలకు సూచించారు. ఈ సందర్భంగా కరోనాపై పోరుకు రూ.2కోట్లు విరాళం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌కు పార్టీ నాయకులు అభినందించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని