గ్రామ వాలంటీర్లు సమర్థంగా పనిచేయాలి: పవన్‌
close
Published : 30/03/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామ వాలంటీర్లు సమర్థంగా పనిచేయాలి: పవన్‌

అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్లు విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కొన్ని వేల మంది జనం బయటికి వచ్చి రేషన్‌ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి రేషన్‌ సరకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. దాని ప్రకారం గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి.. జనం రోడ్ల మీదకి రాకుండా చూడాలి. ఇలాంటి కష్టకాలంలో తమ పనిని మరింత బాధ్యతతో కష్టపడి చేస్తారని ఆశిస్తున్నా’ అని పవన్‌ పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ని విజయవంతం చేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని