నారాయణస్వామిని బర్తరఫ్‌ చేయాలి: కళా
close
Published : 14/04/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నారాయణస్వామిని బర్తరఫ్‌ చేయాలి: కళా

అమరావతి: మైనారిటీల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు డిమాండ్‌ చేశారు. మైనారిటీలంటే వైకాపాకు ఎందుకు అంత చిన్నచూపని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచీ మైనారిటీలపై ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతూ అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించడం లేదనడం దుర్మార్గమన్నారు. శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ని సభలోనే మంత్రి బొత్స నీచంగా మాట్లాడి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కళా మండిపడ్డారు.  మైనారిటీలంతా తెదేపా వెంట ఉన్నారన్న అక్కసుతో వైకాపా నేతలు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తు్నారని విమర్శించారు. ముస్లింలకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కళా డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ వ్యాఖ్యల వెనుక సీఎం ఉన్నట్లు ప్రజలు భావిస్తారని కళా పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని