చేనేత కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోండి: పవన్‌
close
Published : 04/05/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేనేత కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకోండి: పవన్‌

అమరావతి: లాక్‌డౌన్‌ వల్ల చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ప్రతి ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. చేనేత కళాకారులకు ఏ రోజు పనిచేస్తే ఆ రోజే కుటుంబం గడిచే పరిస్థితులు ఉన్నాయి. కరోనా మూలంగా లాక్‌డౌన్‌ విధించడంతో పూట గడవడం ఇబ్బందిగా మారింది. చేనేత కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయని.. వారి ఈతి బాధలను తెలియచేస్తూ పార్టీ కార్యాలయానికి విజ్ఞాపనలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృత్తిపై 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రభుత్వం గత ఏడాది నేతన్న నేస్తం పథకంలో 83 వేల మందికే ఆర్థిక సాయం చేసింది’.

‘లాక్‌డౌన్‌ మూలంగా చేనేత రంగం కుదేలయింది. ఈ రంగాన్నే నమ్ముకున్న వారి జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని ఈ కుటుంబాలు కోరుతున్నాయి. వారి డిమాండ్‌ సహేతుకమైనదే. లాక్‌డౌన్‌ అనంతరం వారి జీవనోపాధికి అవసరమైన మార్గాలను చూపడంతోపాటు, ముడి సరకును అందించాల్సిన బాధ్యతను రాష్ట్ర జౌళి శాఖ చేపట్టాలి. నేతన్న నేస్తం పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయకుండా ఈ వృత్తిపై ఆధారపడ్డవారందరికీ అమలు చేయాలి’ అని పవన్‌ చెప్పారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని