మండలి అభ్యర్థిగా ఉద్ధవ్‌ నామినేషన్‌
close
Updated : 11/05/2020 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండలి అభ్యర్థిగా ఉద్ధవ్‌ నామినేషన్‌

ఎన్నిక లాంఛనమే!

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మే 21న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఖాళీగా ఉన్న తొమ్మిది స్థానాలకుగానూ ఇద్దరు అభ్యర్థుల్ని నిలిపేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దీంతో ఠాక్రే మండలిలో అడుగుపెట్టడం లాంఛనమే అవనుంది. 

మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా భాజపా నుంచి నలుగురు, శివసేన, ఎన్సీపీ నుంచి ఇద్దరు చొప్పున, కాంగ్రెస్ నుండి ఒకరు ఎన్నికయ్యే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో శివసేన నేతల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఒకవేళ ఇద్దరూ నామినేషన్లు వేస్తే ఎన్నికలు అనివార్యమయ్యేవి. కానీ, ఎట్టకేలకు చివరి క్షణంలో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గడంతో ఠాక్రే ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్న ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని