వారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదు:పవన్‌
close
Published : 17/05/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదు:పవన్‌

విజయవాడ: కరోనా సమయంలో బాధ్యతలు విస్మరించిన ప్రజాప్రతినిధుల గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలను కోరారు. కడప జిల్లా నాయకులతో పవన్ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదని పవన్‌ మండిపడ్డారు. ఎర్ర చందనం తరలిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పండ్ల తోటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక శక్తి లేకపోయినా తోటివారిని ఆదుకోవాలనే మంచి మనసు జనసైనికుల్లో ఉందని.. జనసైనికులే పార్టీకి ఇంధనమని పవన్‌ పేర్కొన్నారు.

వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి..

ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ‘సుమారు 7,600 మంది పొరుగు సేవల ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగుల జీతాలు రూ. 6 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న కాలంలో జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారు? ఈ కష్ట కాలంలో ఉద్యోగులను తొలగించొద్దు అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించి.. ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని