అఫ్రిది జోకర్‌.. ఇమ్రాన్‌ విషం చిమ్ముతున్నారు
close
Updated : 18/05/2020 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఫ్రిది జోకర్‌.. ఇమ్రాన్‌ విషం చిమ్ముతున్నారు

న్యూదిల్లీ: టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌లపై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు.

తాజాగా పాక్‌ ఆక్రమిత కశ్మర్‌లో పర్యటించిన అఫిద్రి మాట్లాడుతూ.. ‘నేను మీ అందమైన గ్రామంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో ఇక్కడ పర్యటించాలనుకున్నా. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెద్ద వ్యాధితో బాధపడుతోంది’ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన అఫ్రిది ఆ తర్వాత ‘ప్రధాని మోదీ కశ్మీర్‌లో ఏడు లక్షల సైన్యాన్ని మోహరించారు. ఇది పాకిస్థాన్‌ మొత్తం సైన్యానికి సమానం. కశ్మీర్‌లో ఉండే భారతీయులు కూడా పాక్‌ ఆర్మీకి మద్దతుగా ఉన్నారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో గౌతమ్‌గంభీర్‌ స్పందించారు.

‘‘సుమారు 20 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్‌కు 7లక్షల సైన్యం ఉందని 16ఏళ్ల వృద్ధుడు చెబుతున్నాడు. 70ఏళ్లుగా కశ్మీర్‌ కోసం యాచిస్తున్నారు. అఫ్రిది, ఇమ్రాన్‌, బజ్వాలాంటి జోకర్లు భారత్‌పైనా, ప్రధాని నరేంద్రమోదీ పైనా విషం చిమ్ముతూ పాక్‌ ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారు. కానీ, కశ్మీర్‌ను ఎప్పటికీ సొంతం చేసుకోలేరు. బంగ్లాదేశ్‌ విషయంలో ఏమైందో గుర్తులేదా?’’ అని ఘాటుగా ట్వీట్‌ చేశారు. గతంలోనూ గంభీర్‌-అఫ్రిదిల మధ్య సోషల్‌ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని