ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తాం: పవన్‌
close
Published : 19/05/2020 03:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తాం: పవన్‌

విజయవాడ: ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విష వాయువు ప్రభావిత ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. విశాఖ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆశలతో ప్రభుత్వం ఆడుకోకూడదని హితవు పలికారు.
మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని పవన్‌ అన్నారు. ఇళ్లస్థలాల విషయంలో పేదలను మభ్యపెట్టకుండా అర్హులందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్‌ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడితే పనిచేయని చట్టం.. ఓ వైద్యుడి విషయంలో మాత్రం బలంగా పనిచేస్తోందని పవన్‌ ఎద్దేవాచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని