నాగబాబు ట్వీట్లపై పవన్‌ కామెంట్‌ 
close
Published : 24/05/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగబాబు ట్వీట్లపై పవన్‌ కామెంట్‌ 

అమరావతి: నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాలు, నిర్ణయాలను పార్టీ అధికారికంగా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూనే ఉందన్నారు. అలా అధికారికంగా చేసిన ప్రకటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని.. ఇలాంటి తరుణంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని