శ్రీవారికి భక్తులిచ్చే ఆస్తులు నిరర్ధకమా?: పవన్‌
close
Published : 25/05/2020 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారికి భక్తులిచ్చే ఆస్తులు నిరర్ధకమా?: పవన్‌

అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన ఆస్తులను నిరర్థకమనడం అనడం దాతలను అవమానించడమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆస్తులను ధర్మ ప్రచారానికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలే తప్ప.. విక్రయించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తితిదే ఆస్తుల విక్రయంపై స్పందిస్తూ సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తితిదేకు దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం చిన్నపాటి ఇళ్ల జాగాలను, కొద్దిపాటి విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములు, భవనాలను ఇచ్చారని పవన్‌ అన్నారు. వాటిని చిన్నవిగా చూడడం, నిరర్థకం అని ముద్రవేయడం అంటే వారిని అవమానించడమేనని పవన్‌ అన్నారు. ఆశ్రమాలు, పీఠాలు సైతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకుంటున్నపుడు ఎస్టేట్‌ విభాగం కలిగిన తితిదే ఎందుకు కాపాడుకోలేకపోతోందని ప్రశ్నించారు. 

అస్తుల వేలం వైపు తితిదే ఎందుకు వెళ్తోందనేదే పెద్ద ప్రశ్న అని పవన్‌ అన్నారు. తితిదేకు డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే చాలా కార్యక్రమాలు నిర్వహించొచ్చని అన్నారు. అంతమాత్రానికి నిధులు సమస్య అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తితిదే కార్యాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలో కూడా తితిదే సభ్యులు, ధర్మ ప్రచారాలు చేసే వారు కూడా ఉన్నారని, అలాంటి చోట తగిన పర్యవేక్షణలో స్వామివారి ఆస్తులు కాపాడుకునే ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇవాళ తితిదే.. రేపు ఇతర ఆలయాల ఆస్తులను కూడా అంగట్లో పెట్టేస్తారా అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్‌లో ఓ చెడు సంప్రదాయంగా మారే అవకాశం ఉందని పవన్‌ అభిప్రాయపడ్డారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని