పవన్‌తో బండి సంజయ్‌ భేటీ
close
Published : 26/05/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌తో బండి సంజయ్‌ భేటీ

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని పవన్ వ్యక్తిగత కార్యాలయంలో ఇద్దరు నేతలూ భేటీ అయ్యారు. సుమారు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది. బండి సంజయ్ భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పవన్ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. ఏపీలో భాజపాతో కలసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలో కూడా కలసి పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పవన్, బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యం నెలకొంది. భాజపా వర్గాలు మాత్రం మర్యాద పూర్వక భేటీ అంటున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని