గుజరాత్‌లో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా
close
Published : 06/06/2020 03:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుజరాత్‌లో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయగా.. నేడు మరో ఎమ్మెల్యే అదే బాటలో నడిచారు. గత మూడు రోజుల్లో ఇది మూడో రాజీనామా. మోర్బీ నియోజకవర్గం నుంచి గెలిచిన బ్రిజేష్‌ మెజ్రా శాసనసభ సభ్యత్వంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ఆమోదించినట్లు అసెంబ్లీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గత బుధవారం ఎమ్మెల్యేలు అక్షయ్‌ పటేల్‌, జీతూ చౌధరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మార్చిలో ఒకేసారి ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. జూన్‌ 19న గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రాజీనామాల పర్వం కొనసాగుతుండడం ప్రాధాన్యం సంతరించకుంది.

గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్ధులను బరిలో దింపగా, భాజపా ముగ్గురిని పోటీలో ఉంచింది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు భాజపా తరపున  103 మంది, కాంగ్రెస్‌ తరపున 68 మంది గెలిచారు. భారతీయ ట్రైబల్‌ పార్టీ రెండు, ఎన్‌సీపీ, స్వతంత్రులు చెరో స్థానంలో గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 60కి చేరింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని