మధ్యతరగతికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు
close
Published : 08/06/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యతరగతికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు

విజయవాడ: లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్య తరగతి వర్గాలు, వేతన జీవులకు భరోసా కల్పించేలా కేంద్రం ఉపశమన చర్యలు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటినుంచి మధ్యతరగతికి ఊతమిచ్చేలా ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలోనూ వారికోసం యోచించిందని అభిప్రాయపడ్డారు. సొంతింటి రుణాలకు రూ.1.50 లక్షల వడ్డీ రాయితీ అదనంగా ఇవ్వడంతో గృహ రుణాలు తీసుకున్న ఉద్యోగులు, చిరు వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆదాయపు పన్ను రీఫండ్‌ చెల్లింపులో జాప్యాన్ని తగ్గించడం వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించిందన్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన పడకుండా బ్యాంకులు రుణాలను సులభంగా ఇచ్చేందుకుగాను ఆ రంగానికి తగిన ఉద్దీపన చర్యలు చేపట్టిందని జనసేనాని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్థిక ఉపశమన చర్యల ప్రయోజనాలను జనసేన శ్రేణులు ప్రజలకు వివరించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని