భాజపా లేని కూటమితో భాగస్వామ్యం వద్దు
close
Published : 13/06/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా లేని కూటమితో భాగస్వామ్యం వద్దు

పార్టీ శ్రేణులకు జనసేనాని సూచన

అమరావతి: ప్రజా సమస్యలపై పోరాటం చేసే క్రమంలో భాజపాతో కలిసి ముందుకెళ్లాలని జనసేన శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కలిసి పని చేసేందుకు భాజపాయేతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రం, ఎంపీ నియోజకవర్గ స్థాయిలో భాజపా, జనసేన పార్టీల సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భాజపాయేతర పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు అయితే ఇరు పార్టీల సమ్మతంతోనే ఇతర పార్టీలతో పనిచేసేందుకు ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. భాజపా లేని కూటమితో ఎట్టిపరిస్థితుల్లో భాగస్వామ్యం కావొద్దని పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని