బడ్జెట్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌
close
Published : 17/06/2020 05:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా... ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే వైకాపా ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించినట్లుగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఈ బడ్జెట్‌ అంతా ఓ పెద్ద కనికట్టు అని పవన్‌ అన్నారు. ‘‘వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణాల, వైద్య ఆరోగ్యం లాంటి కీలక శాఖల బడ్జెట్‌లో కోతలు విధించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా ఎంతోకాలం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) బడ్జెట్‌ను రూ.2.27లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. కానీ సవరించిన అంచనాలతో ఖర్చు చేసినది రూ.1.74 లక్షల కోట్ల మాత్రమే. వాస్తవ బడ్జెట్ అంచనాలకు సవరణలకు తేడా రూ.53,217.54 కోట్లుగా ఉంది’’ అని పవన్‌ వివరించారు. 

కొత్త బడ్జెట్ చూసిన తరువాత జనసేన నేతలు, పార్టీకి సేవలు అందిస్తున్న మేధావులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారని పవన్‌ చెప్పారు. ఆ వివరాలు ఈ ట్వీట్‌లో...

 

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని