‘శాసన మండలిలో ఘర్షణకు మంత్రులే కారణం’
close
Updated : 18/06/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘శాసన మండలిలో ఘర్షణకు మంత్రులే కారణం’

అమరావతి: శాసన మండలిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు దాడికి యత్నిస్తుంటే తాము అడ్డుకున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సభలో ఎవరు ఎవరి సీట్ల వద్దకు వచ్చారో తెలియాలంటే మండలి సమావేశాల వీడియోలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శాసన మండలిలో ఘర్షణకు మంత్రులే కారణమని ఆరోపించారు. సభలో మంత్రులు వాడుతున్న భాష ఎంతో అభ్యంతరకరంగా ఉందన్నారు. తమ నాయకుల వద్ద మార్కులు కొట్టేయాలనే భావనలో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సభకు ఎమ్మెల్సీలుగా వచ్చింది ఇందుకేనా అని తమకే అవమానంగా ఉందని బీద రవి చంద్ర  అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని