కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
close
Published : 27/06/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

అమరావతి: కాపు నిధులపై శ్వేత ప్రతం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో తెలపాలని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వెనుకబడిన జాతికి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంత వరకు కాపులను ఏమర్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ పెద్దలు మరింత తెలివితేటలతో ‘గాలికిపోయే పేలాల పిండి కృష్ణార్పణం’ అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతున్నారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారు. 

గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించగా, ప్రస్తుత పాలకులు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. మరి వారు ఇచ్చిందెంత? వీరు ఇచ్చిందెంత? అడిగిన వారికి కాకి లెక్కలు చెబుతున్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాపుల కోసం వివిధ పథకాల ద్వారా గత 13 నెలల కారణంగా 23 లక్షల మంది కాపుల కోసం రూ.4,770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్నారు. ఈ నిధులను రాష్ఱంలో ప్రజల అందిరితోపాటు ఇచ్చారా? లేదా కాపులకు మాత్రమే ఇచ్చారా? అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదు. రిజర్వేషన్‌ గురించి కాపులు డిమాండ్‌ చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడగా జనసేన భావిస్తోంది. అసలు కాపు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో శ్వేత ప్రతాన్ని ప్రకటించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షల మందిని మాత్రమే గుర్తించడంలో పలు సందేహాలు కలుగుతున్నాయి.

వాస్తవాలు కాపులతో పాటు ప్రజలు అందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం కులాల మధ్య విద్వేషాలు పెరగడానికి ఆస్కారం కల్పిస్తోంది. ఎక్కువ నిధులు ఒకే కులానికి దక్కుతున్నాయని చెప్పడం శ్రేయస్కరం కాదు. అందువల్ల కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్న నిధుల వివరాలను సమగ్రంగా ప్రజలకు చెప్పాలని, ఒక్క కార్పొరేషన్‌కు మాత్రమే కాక వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధుల వివరాలపై
శ్వేత పత్రం ప్రకటించాలని కోరుతున్నాం. కాపుల రిజర్వేషన్‌ నేపథ్యంలో పుట్టినదే కాపు కార్పొరేషన్‌. అటువంటి కాపు రిజర్వేషన్‌ గురించి వైఎస్‌ఆర్‌సీపీలోని కాపు ప్రజాప్రతినిధులు పూర్తిగా మరిచిపోయారు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.    


 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని