‘కాపులపై జగన్‌ సర్కారుది కపట ప్రేమ’
close
Published : 28/06/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కాపులపై జగన్‌ సర్కారుది కపట ప్రేమ’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 

అమరావతి: కాపు రిజర్వేషన్ల అంశం స్వార్థ రాజకీయపరుల గుప్పెట్లో నలిగిపోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. కాపులపై జగన్‌ సర్కారుది కపట ప్రేమ అని పవన్‌ విమర్శించారు. ‘‘కాపులు ఆర్థికంగా బలపడటం కొన్ని వర్గాలకు ఇష్టం లేదు. ఈబీసీ కేటగిరీలో చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం కోటానూ జగన్‌ తొలగించారు. కాపు రిజర్వేషన్లను జగన్‌ సర్కారు ఎందుకు పునరుద్ధరించడం లేదు. వైకాపాలో కాపు నేతలు రిజర్వేషన్ల అంశంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లను పునరుద్ధరించాలి’’ అని పవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని