తిన్నవి స్నాక్సా.. కరెన్సీ నోట్లా: లోకేశ్‌
close
Published : 10/07/2020 08:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిన్నవి స్నాక్సా.. కరెన్సీ నోట్లా: లోకేశ్‌

ఈనాడు, అమరావతి: ‘ఏడాది క్రితం ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన రోజున వాటర్‌బాటిళ్లు, స్నాక్స్‌కు రూ.59.5 లక్షల బిల్లయ్యిందట! తిన్నవి స్నాక్సా.. కరెన్సీ నోట్లా?’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం ట్విటర్‌లో ప్రశ్నించారు. ‘డబ్బులు మంచినీళ్లలా ఖర్చుచేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్లపాలు, ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు. ఒక మీటింగ్‌లో తాగిన వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖరీదు అక్షరాలా రూ.43.44 లక్షలు. ఒక్క రోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయ్యుండాలి. లేకపోతే స్కామైనా చేసుండాలి’ అని ఆయన ధ్వజమెత్తారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని