ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర
close
Updated : 12/07/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భాజపా కుట్ర

జైపూర్‌: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ.15 కోట్లు చొప్పున ఇవ్వజూపుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ ఇలాంటి కుట్రలకు పాల్పడడం సిగ్గు చేటు అని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కొవిడ్‌-19పై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే భాజపా అడ్డంకులు సృష్టిస్తోందని గహ్లోత్‌ ఆరోపించారు. గతేడాది కర్ణాటక, ఈ ఏడాది జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలను దింపేసి ఆ పార్టీ గద్దెనెక్కిందని గుర్తుచేశారు. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇక్కడా అలాంటి ప్రయత్నాలే చేస్తే తాము సమర్థంగా తిప్పికొట్టామని చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు మళ్లీ జరుగుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో ప్రజలే భాజపాకు బుద్ధి చెబుతారని గహ్లోత్‌ అన్నారు.

అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్‌, మద్దతిస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారంటూ 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీనిపై భాజపా స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గహ్లోత్‌ భాజపాపై విమర్శలు గుప్పించారు. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, రాష్ట్రీయ లోక్‌దశ్‌, సీపీఎం, భారతీయ ట్రైబల్‌ పార్టీకి చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గహ్లోత్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని