పరవాడ ఘటనపై స్పందించిన పవన్‌
close
Published : 15/07/2020 02:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరవాడ ఘటనపై స్పందించిన పవన్‌

విశాఖపట్నం: విశాఖ సాల్వెంట్‌ కర్మాగారంలో జరిగిన పేలుడు ప్రమాదం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ జిల్లాలోని గాజువాక, పరవాడ కేంద్రాలుగా విస్తరించిన పారిశ్రామిక ప్రాంతాల్లో  వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సాయినార్‌ ఫార్మా ఘటన మరువక ముందే రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్‌ కర్మాగారంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు.

‘‘వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడంలేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి. రసాయనాలు నిల్వచేస్తున్న ప్రమాదకర పరిశ్రమలో రక్షణ ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండాలి కదా? విశాఖ సాల్వెంట్‌ పరిశ్రమలో రక్షణ ఏర్పాట్లు సరిగా ఉంటే ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఈ ప్రమాదంపై ప్రభుత్వం క్షుణ్నంగా విచారణ జరిపి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని