TS News: GHMC ఆఫీస్‌ వద్ద భాజపా ధర్నా
close
Published : 18/06/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: GHMC ఆఫీస్‌ వద్ద భాజపా ధర్నా

హైదరాబాద్‌: నగరంలోని నాలాల్లో పూడికతీత, ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భాజపా ధర్నా చేపట్టింది. వర్షాకాలం ప్రారంభమైనా ప్రభుత్వం నాలాల పూడికతీతకు ఎలాంటి ప్రణాళికలను రూపొందించలేదని.. తక్షణమే చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ నేతృత్వంలో భాజపా కార్పొరేటర్లు, శ్రేణులు కార్యాలయం వద్ద బైఠాయించాయి. భాజపా ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలు లోనికి వెళ్లేందుకు గేట్లు ఎక్కడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

రాజాసింగ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌, చింతల రామచంద్రా రెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డిని మాత్రమే వినతిపత్రం ఇచ్చేందుకు లోపలికి అనుమతించారు. కార్పొరేటర్లను లోపలికి అనుమతించకపోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కమిషనర్‌ లేకపోవడంతో వినతిపత్రం ఇవ్వకుండానే భాజపా బృందం బహిష్కరించి వచ్చేసింది. అనంతరం రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడారు. గతేడాది వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నాలాల పూడికతీతతో పాటు ఆక్రమణలు తొలగించాల్సిందిపోయి ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కమిషనర్‌ అందుబాటులో లేకపోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని