Bandi Sanjay: అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను పేదలకు పంచుతాం
close
Published : 30/07/2021 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bandi Sanjay: అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను పేదలకు పంచుతాం


హైదరాబాద్‌ : 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ మాట్లాడారు.

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయం పట్టుకుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీఎంకు దళితులు, గిరిజనులపైన చిత్తశుద్ధి లేదు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు.. రూ.30 లక్షలు ఇవ్వాలి. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదా?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

‘ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాం. తొలి సంతకం ఈ ఫైల్ పైనే చేస్తాం. ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయి?. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులను కేసీఆర్ నాశనం చేశారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10వేల డప్పులతో ఉద్యమిస్తాం. 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను మోదీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2023లో తెలంగాణలో పేదల రాజ్యం రావాలి. కేసీఆర్ లాఠీ, పోలీసు తూటాలకు భాజపా కార్యకర్తలు భయపడరుఅగ్రవర్ణ పేదల పక్షాన భాజపా పోరాడుతుంది’ అని బండి సంజయ్‌ వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని