మూడు నెలల్లో మార్పు కనిపించాలి: జగన్‌
close
Updated : 03/01/2020 13:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడు నెలల్లో మార్పు కనిపించాలి: జగన్‌

అమరావతి: అనినీతి నిరోధకశాఖ (ఏసీబీ) పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మరింత చురుకుగా, అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఏసీబీ పనితీరుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఏసీబీ చీఫ్‌ విశ్వజిత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజలెవరూ లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారులు లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. సెలవుల్లేకుండా పనిచేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో మార్పు కనిపించాలని.. కావాల్సినంత సిబ్బందిని తీసుకోవాలన్నారు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశామని.. దాని వల్ల మంచి ఫలితాలు కనిపించాలని నిర్దేశించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని