రాజధానిపై రాష్ట్రపతికి ప్రవాసాంధ్రులలేఖ
close
Published : 07/01/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధానిపై రాష్ట్రపతికి ప్రవాసాంధ్రులలేఖ

కాలిఫోర్నియా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆవేదనను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. ‘2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు. దీంతో అప్పుడు ఎన్నికైన ప్రభుత్వం అన్ని సౌకర్యాలకు అనుగుణంగా అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసింది. రోడ్డు రవాణా, రైల్వే, విమానాశ్రయం అన్ని వనరులను పరిశీలించిన తర్వాతే అమరావతిని ఎంచుకున్నారు. ఇందుకు ఏపీ అసెంబ్లీ, అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. 2015 అక్టోబర్‌ 22న ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం వ్యవసాయంపై ఆధారపడిన 29 పరిసర గ్రామాల రైతుల నుంచి 33వేల ఎకరాలను తీసుకుంది. రైతులు కూడా తమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించి భూములను ఇచ్చారు. కానీ ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు కట్టాలంటున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలే అవకాశం ఉంది. ఇది రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది’ అని వారు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భూములిచ్చిన రైతులు రెండు వారాలుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు రాజధాని తరలించడం వల్ల కలిగే ఇబ్బందులను పేర్కొంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని వారు కోరారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని