మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద ఉద్రిక్తత
close
Published : 11/01/2020 11:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద ఉద్రిక్తత

తిరుపతి నగరం: తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు. సుగుణమ్మను ముఖ్య నాయకులతో సమావేశం కాకుండా గృహాంలో నిర్భంధించారు. దీంతో తెదేపా శ్రేణులు సుగుణమ్మ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సుగణమ్మ, తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ యాదవ్‌ సైతం గృహాంలో నిర్భంధించారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని