భారత యువతికి.. పాక్‌ డ్రైవర్‌ సాయం
close
Published : 14/01/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత యువతికి.. పాక్‌ డ్రైవర్‌ సాయం

దుబాయ్‌: భారత్‌కు చెందిన యువతికి పాకిస్థాన్‌ క్యాబ్‌ డ్రైవర్‌ సాయం చేసిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. కేరళకు చెందిన రాచెల్‌ రోజ్‌ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. రోజ్‌ ఇంగ్లాండ్‌లోని లాంక్‌స్టర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యనభ్యసిస్తోంది. ఈనెల 4వ తేదీన తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. పాక్‌కు చెందిన మొదాసిర్‌ ఖాదిమ్‌ అనే వ్యక్తి క్యాబ్‌ ఎక్కింది. మధ్యలోనే తన స్నేహితులు వేరే కారులో కనిపించడంతో ఖాదిమ్‌ కారు దిగి వారితో కలిసి వెళ్లిపోయింది. ఆ సమయంలో రోజ్‌ తన వ్యాలెట్‌ను కారులోనే మరిచిపోయింది. 

చాలా సమయం గడిచిన తర్వాత ఖాదిమ్‌ తన కారులో వ్యాలెట్‌ను గమనించాడు. వ్యాలెట్‌లో రోజ్‌ యూకే స్టూడెంట్‌ వీసా, ఎమిరేట్స్‌ ఐడీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ డ్రైవింగ్ లైసెన్స్‌, హెల్త్‌ ఇన్యూరెన్స్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుతో పాటు వెయ్యి దిర్హామ్‌లు ఉన్నాయి. వ్యాలెట్‌ను ఆమెకు చేర్చేందుకు ఖాదిమ్‌ అక్కడి రవాణా శాఖ అధికారులను సంప్రదించాడు. వాళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఖాదిమ్‌ రోజ్‌ ఇంటికి వెళ్లి ఆమె దాన్ని తిరిగి ఇచ్చేశాడు. సంతోషించిన రోజ్‌ తండ్రి డ్రైవర్‌ ఖాదిమ్‌కు 600 దిర్హామ్‌లు ఇవ్వగా అతడు తిరస్కరించడంతో పాటు రోజ్‌ తన సోదరిలాంటిదని చెప్పాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని