ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళులు
close
Published : 18/01/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళులు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, దగ్గుబాటి పురంధేశ్వరి, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ, సుహాసిని, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి, తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తెదేపా కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని