‘భారతమాత మహా హారతి’కి పవన్‌ కల్యాణ్‌
close
Updated : 26/01/2020 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భారతమాత మహా హారతి’కి పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న ‘భారతమాత మహాహారతి’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గరికపాటి నరసింహారావు తదితరులు హాజరుకానున్నారు. ట్యాంక్‌ బండ్‌ సమీపంలోని ఐ మాక్స్‌ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో సాయంత్రం  5 గంటలకు ఈ వేడుక జరగనుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కరాలకు ఎంపికైన వారికి జనసేనాని పవన్‌ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘పీవీ సింధు పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయం. పలు అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచి క్రీడా రంగంలో తెలుగువారి సామర్థ్యాన్ని చాటుతున్నారు. రంగస్థలంపై పౌరాణిక నాటకాలకు జీవం పోసిన యడ్ల గోపాలరావు, తోలు బొమ్మలు చేసే హస్త కళ ప్రవీణుడు దలవాయి చలపతి కళనే నమ్ముకొని అంకితమైపోయారు. సంస్కృత కవి శ్రీభాష్యం విజయసారథి, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న చింతల రెడ్డి తమతమ రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపు లభించిందని’’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని