మండలి రద్దుపై రాజమహేంద్రవరంలో బైక్‌ ర్యాలీ
close
Updated : 29/01/2020 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండలి రద్దుపై రాజమహేంద్రవరంలో బైక్‌ ర్యాలీ

రాజమహేంద్రవరం: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పుష్కరఘాట్ వద్ద తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించిన ఈ ర్యాలీలో వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘ మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. మండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

అనంతపురంలో..
శాసనమండలి రద్దును నిరసిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో తెదేపా నేతలు బైక్‌ ర్యాలీ చేపట్టారు. గాంధీనగరం నుంచి ప్రధాన రహదారుల మీదుగా సాగిన ప్రదర్శనలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని