అన్నపూర్ణ స్టూడియోలో మంత్రి తలసాని సమీక్ష
close
Published : 10/02/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నపూర్ణ స్టూడియోలో మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌: ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మరోమారు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై చిరంజీవి, నాగార్జునతో మంత్రి చర్చించారు. అనంతరం అక్కడే హోం, రెవెన్యూ, న్యాయ, కార్మికశాఖ అధికారులతో తలసాని సమీక్ష నిర్వహించారు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం శంషాబాద్‌ పరిసరాల్లో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కల్చరల్‌ సెంటర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం కోసం అవసరమైన స్థలాల సేకరణ జరపాలని సూచించారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతివ్వాలన్నారు. ఎఫ్‌డీసీ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుఉ చర్యలు చేపట్టాలని చెప్పారు. పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి తలసాని స్పష్టంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని