నైపుణ్యాభివృద్ధి శిక్షణకు 30కేంద్రాలు:జగన్‌
close
Updated : 17/02/2020 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నైపుణ్యాభివృద్ధి శిక్షణకు 30కేంద్రాలు:జగన్‌

అమరావతి: రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శిక్షణా కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సీఎం సమీక్షి నిర్వహించారు. నెలన్నర రోజుల్లోనే డిజైన్లు సహా ఆర్థిక వనరుల సమీకరణ చేసి ఏడాదిలోపు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున, నాలుగు ట్రిపుల్‌ ఐటీలకు అనుబంధంగా నాలుగు కేంద్రాలు సహా పులివెందుల జేఎన్టీయూకు అనుబంధంగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు. ఐటీ రంగంలో హైఎండ్‌ స్కిల్స్‌పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు దీనిలో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసే దిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. 

ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలన్నీ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారానే చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి శిక్షణ కార్యక్రమం, కోర్సులు, నాణ్యతను ఈ కమిటీ ద్వారా పరిశీలించాలన్నారు. ఉన్నత విద్యామండలి, ఐటీ విభాగాలకు చెందిన వారిని ఇందులో సభ్యులుగా నియమించాలన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం, ఇతర రాష్ట్రాల్లోని ఐటీ రంగ పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. ఐటీ రంగంలో రాష్ట్రానికున్న అవకాశాలు.. అనుసరించాల్సిన పాలసీపైనా సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో రూ.4500 కోట్లకుపైగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు పెండింగులో పెట్టారన్న సీఎం.. నమ్మి ఇక్కడ పరిశ్రమలు పెడితే వాటికి రాయితీలను కూడా ఇవ్వని పరిస్థితి చూశామని ఆక్షేపించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని