గోదావరి తీరం.. శివ నామస్మరణం
close
Updated : 21/02/2020 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోదావరి తీరం.. శివ నామస్మరణం

రాజమహేంద్రవరం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌లకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలాచరించిన అనంతరం శివాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు. ఉమా కోటిలింగేశ్వర స్వామి, ఉమా మార్కండేయ స్వామి, విశ్వేశ్వరస్వామి, పలిమెల ఉమా కొప్పేశ్వరస్వామి, ఏలేశ్వరం, ధర్మవరం, కాకినాడ, తూరంగి, కణపూరు ఆలయాల్లో దర్శనాలకు భక్తులు బారులు తీరారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామాల్లో భక్తులు పోటెత్తారు. సామర్లకోటలో స్వామి వారి దర్శనానికి  గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రజాప్రతినిధుల సేవలో తరలిస్తూ ఆలయ సిబ్బంది సామాన్యులను పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు క్యూలైన్లలో ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని