‘ఐరన్‌ మ్యాన్‌’ చెంత ‘ఆటో’ మ్యాన్‌
close
Published : 03/03/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఐరన్‌ మ్యాన్‌’ చెంత ‘ఆటో’ మ్యాన్‌

గుజరాత్‌: ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం ‘ఉక్కుమనిషి’ సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని ఇటీవల మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సందర్శించారు. సందర్శన అనంతరం తన అనుభవాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు ఆనంద్‌. విగ్రహం ఎదుట నిల్చున్న ఫొటోని జత చేస్తూ.. ‘ఉక్కు మనిషి పాదాల ఎదుట నిలుచున్న ఈ ఫొటో నా ఆల్బమ్‌లో విలువైన జ్ఞాపకం’ అంటూ రాసుకొచ్చారు. మరొకొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ.. అక్కడి వసతులు, సౌకర్యాలు ప్రపంచస్థాయిలో ఉన్నాయంటూ కొనియాడారు. ఈ అద్భుతాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదన్నారు.

ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫొటోలపై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ఒకే చోట ఇద్దరు ఉక్కు మనుషులను చూడటం అద్భుతంగా ఉందంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టారు. మరికొందరు ఐరన్‌ మ్యాన్‌ చెంత.. ఆటో మ్యాన్‌ అంటూ కామెంట్‌ పెట్టారు. మరికొందరు స్టాట్యూ ఆఫ్‌ యూనిటీని సందర్శించిన చిత్రాలను జతచేశారు. 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. గుజరాత్‌లోని కెవాడియా పట్టణంలో నర్మదా నది ఒడ్డున నిర్మించిన ఈ విగ్రహం పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని